బారాస నాయకుల బైండోవర్

భారాస నాయకుల బైండోవర్
వరంగల్ ప్రతినిధి డిసెంబర్ 7 యువతరం న్యూస్:
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టులపై భారాస పార్టీ శుక్రవారం ఛలో హైదరాబాద్ పిలుపు నిచ్చింది. దాంతో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని భారాస నాయకులను శుక్రవారం తెల్లవారుజామున స్టేషన్ లో ఎస్సై శ్రీకాంత్ ,ఎస్సై రాజు బైండోవర్ చేశారు. అదే రోజు సాయంత్రం విడుదల చేసినట్లు వెల్లడించారు. భారస పార్టీ సీనియర్ నాయకుడు కేతిరి రాజశేఖర్ తెలంగాణ ఉద్యమకారుడు, నేరెళ్ల రాజు మూడో డివిజన్ అధ్యక్షుడు, పస్తం యాదగిరి తెలంగాణ ఉద్యమకారుడు, పత్రి రాజపోషాలు నాయకులు, పస్లాది మల్లయ్య ఎస్సార్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు, గంధం గోవిందు భారస వరంగల్ జిల్లా నాయకులు, పస్తం నరసింగం సీనియర్ నాయకులు, సౌరం కళ్యాణ్ ఏనుమాముల శాఖ అధ్యక్షులు, సౌరం కవి రాజు తదితరులు ఉన్నారు.