ANDHRA PRADESHBANKINGBREAKING NEWSOFFICIALWORLD

త్వరలో మార్కెట్లోకి కొత్త 50 రూపాయల నోటు

త్వరలో మార్కెట్లోకి కొత్త ₹50 రూపాయల నోటు

అమరావతి ప్రతినిధి ఫిబ్రవరి 13 యువతరం న్యూస్:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సంతకముతో కూడిన కొత్త ₹50 నోటు త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

ఇటీవలనే సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ లోనే ఆయన గవర్నర్ బాధ్యతల ను చేపట్టారు.ఈ క్రమంలో మహాత్మా గాంధీ సిరీస్ లో కొత్త రూ.50 నోటును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది ఆర్బీఐ.

ఇప్పుడున్న నోట్లపై మాజీ గవర్నర్ సంతకం ముద్రించి ఉంది. కొత్త నోట్లపై ప్రస్తుతం గవర్నర్ సంతకంతో వీటిని విడుదల చేసేందుకు సిద్ధమైంది. కొత్తగా ప్రింట్ చేయనున్న రూ. 50 నోటు మహాత్మా గాంధీ సిరీస్ లో భాగంగానే డిజైన్ ఉండనుంది అని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. అదే విధంగా పాత నోట్ల విషయంలోనూ కీలక ప్రకటన చేసింది.

కొత్త నోట్లు రానున్న వేళ పాత 50 రూపాయల నోటును వెనక్కి తీసుకుం టారా? అనే విషయంపైనా స్పష్టత ఇచ్చింది. పాత నోట్ల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త నోట్లు విడుదల చేసినప్పటకీ ప్రస్తుతం ఉన్న నోట్లు కూడా మార్కెట్లో చెలామణీలోనే ఉంటాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల కు చెక్ పెట్టేలా ఆర్బీఐ పూర్తి క్లారిటీ ఇచ్చింది.కొత్త నోటు ఎలా ఉంటుందం టే..?ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం కొత్త యాబై రూపాయల నోటు మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ లోనే విడుదల చేయనున్నారు.

దీనిని ఫ్లోర్ సెంట్ నీలం రంగులో డిజైన్ చేయను న్నట్టు తెలుస్తోంది. నోటు వెనుక భాగంలో రథం తోఉన్న హంపి చిత్రంతో దేశ సాంస్కఈతిక వారసత్వా న్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఈ నోటు పరిమాణం 66 మి.మీ x 135 మి.మీ ఉండనుందట.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!