STATE NEWSTELANGANA

నేతకాని కులం ‘అస్తిత్వ’ పోరాటం గెజిట్‌లో పేరు మాయం 

నేతకాని కులం ‘అస్తిత్వ’ పోరాటం గెజిట్‌లో పేరు మాయం

పాలకుల నిర్లక్ష్యంపై జాడి ఈశ్వర్ నేతకాని ఆగ్రహం

ములుగు ప్రతినిధి మే 5 యువతరం న్యూస్ :

తెలంగాణ గడ్డపై గోదావరి తీర వెంబడి, ప్రకృతి ఒడిలో జీవించే అరుదైన అడవి తెగ ‘నేతకాని’ కులం నేడు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. అడవి బిడ్డలుగా, చేనేత వారసులుగా భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తమ కులాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విస్మరించడం అత్యంత దారుణమని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి ఈశ్వర్ నేతకాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు,

విశిష్ట సంస్కృతి – వీడని పోరాటం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,,నేతకాని కులం కేవలం ఒక సమూహం కాదని, అది ఒక అద్భుతమైన జీవన సంస్కృతికి చిరునామా అని కొనియాడారు మాసంప్రదాయాలు మిగిలిన కులాల కంటే భిన్నమైనవి మా పెళ్లిళ్లు పీటలపై జరగవు తరతరాలుగా మేము బట్టలు నేసిన ‘ధోనుగ కర్ర’ మీదనే మా వివాహ వేడుకలు జరుగుతాయి, బతుకమ్మ పండుగను కూడా దసరా సమయంలో కాకుండా, దసరా పండుగలు అయిన తర్వాత మాకు బ్రతుకులో వెలుగులు నింపిన ప్రత్యేక మాసంలో ‘దీపావళి బతుకమ్మ’ పేరుతో వరంగల్ సీతంపేటలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటాం,అలాగే ‘పోలాల అమావాస్య’ మా ముఖ్యమైన కుల పండుగ,చనిపోయిన పెద్దల కార్యక్రమాలు, ఎడ్లను పూజించడం, ఎడ్ల మట్టి ప్రతిమలను తయారు చేసి గంగమ్మ ఒడికి చేర్చడం మా సంస్కృతిలో భాగం” అని వివరించారు,

అడవి తెగ హస్తకళలు – పాలకుల నిర్లక్ష్యంమొట్టమొదటిసారి దొడ్డు బట్టలు నేసింది మా నేతకాని కులమే. అడవిలో దొరికే కంక బొంగులు, తీగలతో తట్టలు, బుట్టలు అల్లడం,,కోపిరితో నులక మంచాలు తయారు చేయడం,చేపల వలలు, అడవి నారతో తాళ్లు సిద్ధం చేయడం వంటి హస్తకళల్లో మా వారు సిద్ధహస్తులు ప్రకృతిని నమ్ముకుని బతికే అడవి తెగ మాది, చేనేత నుండి పుట్టిన నేతకాని తెగ మాది, కానీ నేడు పాలకులు మమ్మల్ని అధికారిక రికార్డుల నుంచి తుడిచిపెట్టేస్తూ, మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు” అని వాపోయారు,

గెజిట్ గందరగోళం – నిరుద్యోగుల ఆవేదనతెలంగాణ, మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్ సరిహద్దుల్లోని గోదావరి ప్రాంతాల్లో మాత్రమే నివసించే మా జాతికి కుల గణనలో చోటు కల్పించకపోవడం అన్యాయమని జాడి ఈశ్వర్ నేతకాని మండిపడ్డారు, కేంద్ర గెజిట్‌లో ‘మాల సాలె’, ‘నెట్కాని’ అని తప్పుగా ఉండటం వల్ల కేంద్ర ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు దరఖాస్తు చేసేటప్పుడు మా యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనివల్ల వందలాది మంది భవిష్యత్తు అంధకారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు,

ప్రభుత్వాలకు ప్రధాన డిమాండ్లు

కుల గణన సవరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రికార్డులను సవరించి ‘నేతకాని’ పేరుతో అధికారికంగా లెక్కలు విడుదల చేయాలి,అసెంబ్లీ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం మా కులం పేరును గెజిట్‌లో చేర్చడంపై అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర గెజిట్‌లో ‘నేతకాని’ పేరు వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం కూడ నేతకాని పేరుని గెజిట్లో చేర్చాలి,

ఏజెన్సీ హక్కులు అడవి తెగగా గుర్తించి, మాకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన అన్ని ఏజెన్సీ ఫలాలు, హక్కులు తక్షణమే అమలు చేయాలి,

ప్రత్యేక జీవో ఏజెన్సీ ప్రాంత హక్కులు వర్తించేలా చదువు, ఉద్యోగాల దరఖాస్తుల్లో ‘నేతకాని’ అనే పేరు మాత్రమే చెల్లుబాటయ్యేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జీవో జారీ చేయాలి,

మాది గోదావరి తీరంలో పోరాడి బతికిన నేతకాని తెగ జాతి, మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే సహించేది లేదు,మా హక్కులను విస్మరిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నేతకాని బిడ్డలను ఏకం చేసి చలో అసెంబ్లీ, చలో ఢిల్లీ వంటి ఉధృత పోరాటాలకు వెనకాడబోము” అని జాడి ఈశ్వర్ నేతకాని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!