ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

రూ. 6 కోట్ల తో రైతు బజార్ విస్తరణకు భూమి పూజ

పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త

రూ. 6 కోట్ల తో రైతు బజార్ విస్తరణకు భూమి పూజ

150 మంది రైతులకు లబ్ధి

కర్నూలు స్మార్ట్ సిటీగా మార్చడానికి నిరంతర కృషి

పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త

కర్నూలు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం
కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తి పాటి నాగరాజు.

కర్నూలు ప్రతినిధి మే 11 యువతరం న్యూస్:

కర్నూలు ను స్మార్ట్ సిటీగా మార్చడానికి నిరంతర కృషి చేస్తున్నామని రైతు బజార్ విస్తరణ భూమి పూజ సందర్భంగా
పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త పేర్కొన్నారు.
సోమవారం ఉదయం కర్నూలు పట్టణ సి – క్యాంపు రైతు బజార్ వెనుక పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త , కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు తో కలిసి రైతు బజార్ విస్తరణ కొరకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కర్నూలు ను స్మార్ట్ సిటీగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నామని , అందులో భాగంగా సి – క్యాంపులో ఇప్పుడు ఉన్న రైతు బజార్ ను 150 మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఆరు కోట్ల రూపాయలతో విస్తరణ కార్యక్రమం మొదలు పెట్టామని తెలిపారు. ఇందులో రైతులకు అవసరమైన నీరు స్ప్రింక్లింగ్ సిస్టం , డ్రిప్ సిస్టం , పార్కింగ్ సౌకర్యం మరియు రెండు ఫ్లోర్ లతో రైతు బజార్ నిర్మాణం చేయడం జరుగుతుందని , ఈ నిర్మాణ పనులు 9 నెలల లోపు పూర్తి అయ్యేలాగా కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రైతు బజార్ ను సందర్శించారని తెలిపారు. 1999 లో తను ఏర్పాటు చేసిన , తనకి ఇష్టమైన రైతు బజార్ ను సందర్శించిన సందర్భంగా రైతులతో మాట్లాడిన తరువాత దీని విస్తరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆ హామీ ఇప్పుడు నెరవేర్చడం జరుగుతుంది మంత్రి తెలిపారు. రైతు బజార్ నిర్మాణం పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ , పేద ప్రజలకు అత్యంత అవసరమైన మరియు కేవలం 15 రూపాయలకే మూడు పూటల కడుపునిండా భోజనం పెట్టె అన్న క్యాంటీన్ ను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేశారు. అలాగే కర్నూలు బి – క్యాంపులో హైకోర్టు బెంచ్ మరియు అదునాతనమైన కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించే చర్యలు కూడా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ…మంత్రి టి.జి.భరత్ ఆధ్వర్యంలో కర్నూలు లో ప్రతి వారము ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉందని అందులో భాగంగా సోమవారం 6 కోట్ల రూపాయలతో రైతు బజారు విస్తరణ కార్యక్రమం కొరకు భూమి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. బి – క్యాంప్ లో హైకోర్టు బెంచ్ మరియు నూతన కలెక్టరేట్ నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. కర్నూలుకు ఉన్న సమస్యలు కర్నూలు మెడికల్ కాలేజ్ రోడ్డు విస్తరణ , స్పోర్ట్స్ హాస్టల్ తిరుపతికి వెళ్లకుండా ఇక్కడే ఉంచటం మరియు రైతు బజార్ దగ్గర ట్రాఫిక్ సమస్య పరిష్కరించి రైతు బజార్ విస్తరణ చేయటం మొదలగునవని చేశాం అని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి టి. జి. భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నవని పార్లమెంటు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు , మార్కెట్ యార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణ మూర్తి , కర్నూలు మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి , మార్కెట్ యార్డ్ చైర్మన్ గోల్కొండ అజమత్ బీ , వైస్ చైర్మన్ శేషగిరి , ఇంజనీర్ రఘురామ రెడ్డి , స్థానిక నాయకులు స్వామి రెడ్డి , గున్నా మార్క్ , రైతు బజార్ ఎస్టేట్ అధికారి మొదలగువారు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!