ANDHRA PRADESHCRIME NEWSSTATE NEWSTELANGANA
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి

రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన ఎస్సై వెంకటరమణ
(యువతరం ఫిబ్రవరి 21)
ప్యాపిలి విలేకరి:
ప్యాపిలి మండలం రాచర్ల ఎస్సై ఎన్ వెంకటరమణ భూత్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈయన రాచర్ల ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ మధ్యకాలంలోనే తన కూతురి వివాహం జరిపించినట్లు సమాచారం, ఒక ప్రైవేట్ కార్యక్రమం క్రింద హైదరాబాద్ కి వెళ్లి కార్యక్రమం చూసుకొని వెనుతిరిగివస్తుండగా మహబూబ్ నగర్ భూత్పూర్ మండల్ అన్నసాగర్ వద్ద చెట్టును డెకొని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో అల్లుడుపవన్ సాయి తోపాటు డ్రైవర్ మధు మృతిచెందినట్లు సమాచారం. ఎస్ ఐ మృతి తెలుసుకున్న రాచర్ల, ప్యాపిలి జలదుర్గం పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు దిక్బ్రాందీ చెందినారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.