ANDHRA PRADESHCRIME NEWSSTATE NEWS

జంట హత్యల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష

కర్నూలు జిల్లా 4 వ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులోని ముధ్ధాయిల పై కర్నూలు జిల్లా నాలుగవ అదనపు కోర్టు సంచలన తీర్పు …

జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్

జంట హత్య కేసులో ఇద్దరికీ ఉరి శిక్ష , మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధింపు.

మహిళల పై నేరాలు చేసే వారికి ఈ కేసు ఒక కనువిప్పు .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి  కె. వి రాజేంద్రనాథ్ రెడ్డి  ఆదేశాలతో మహిళలకు సంబంధిచిన కేసులలో త్వరితగతిన కేసు ట్రయల్స్ పూర్తి చేసి శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టాము .

కర్నూలు జిల్లాలో ఈ కేసులో ఇది సంచలన తీర్పు అని జిల్లా ఎస్పీ  తెలిపారు.

కర్నూలు కల్లూరు మండలం,. చెన్నమ్మ సర్కిల్ నందు గత సంవత్సరం జంట హత్యల కేసులు నమోదయినాయి. వధువు ను, ఆమె తల్లిని దారుణంగా హత్య చేసి, వధువు తండ్రి పై హత్యాయత్నం చేశారు.

గత ఏడాది తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా కు చెందిన రుక్మిణీ కి కర్నూలు కు చెందిన శ్రవణ్ తో వివాహం జరిగింది.

వివాహం అయిన 3 రోజుల తరువాత వధువు రుక్మిణీ తల్లిదండ్రులు అయిన వెంకటేష్, రమాదేవి లు ,

పెళ్ళి కుమారుడైన శ్రవణ్ , అతని తల్లి దండ్రులైన వర ప్రసాద్ , కృష్ణవేణి లతో శ్రవణ్ కుమార్ నపుంసకుడు (మగతనం లేదు) అని గొడవపడినారు.

ఈ విషయం పై ముద్దాయిలు వీరి కుటుంబం పరువు పోతుందని పెళ్ళికూతురు మరియు ఆమె తల్లితండ్రులను హతమార్చాలని నిందితులు నిర్ణయించుకున్నారు.

కర్నూలు టౌన్ చింతలముని నగర్ లోని ఇంటి వద్ద కత్తుల తో పొడవగా వధువు రుక్మిణి మరియు ఆమె తల్లి రమాదేవి లు అక్కడికక్కడే చనిపోయినారు.

వధువు తండ్రి వెంకటేశ్ తీవ్రముగా గాయపడినాడు.

గాయపడిన వధువు తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు, కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ లో Cr.No.62/2023 U/s 498 (A), 302, 307 R/w 34 IPC గా కేసు నమోదు చేయటం జరిగింది.

తీవ్ర రక్త స్రావ గాయాలతో ఉన్న పెళ్ళి కూతురు తండ్రి వెంకటేష్ ని కర్నూలు 4 వ పట్టణ పోలీసులు హాస్పిటల్ తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం అందించారు.

ముద్దాయిలైన శ్రవణ్ కుమార్ , వరప్రసాద్ , కృష్ణవేణి ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడమైనది. ముద్దాయిలను జైల్లో నే పెట్టి ట్రయల్ పూర్తి చేయడం జరిగినది.

పై కేసులో 90 రోజుల లో విచారణ పూర్తి చేసి, చార్జ్ సీట్ కోర్టులో ఫైల్ చేసిన కర్నూలు డిఎస్పీ విజయశేఖర్ , కర్నూలు నాల్గవ పట్టణ సిఐ .పి.శంకరయ్య ను జిల్లా ఎస్పీ  అభినందించారు.

పై కేసును గౌరవనీయులు అయిన నాలుగవ జిల్లా అదనపు కోర్టు జడ్జి విచారణ పూర్తి చేసి ఈ రోజు అనగా 21.02.2024 వ తేదినాడు తీర్పు ఇవ్వడం జరిగినది.

సదరు తీర్పు ప్రకారం

ముద్దాయి A-1 శ్రవణ్ కుమార్
మరియు
A-2 వరప్రసాద్ @ ప్రసాద్ కు …. ఉరిశిక్ష,

A-3 కృష్ణవేణికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినారు.

మహిళల పై నేరాలు చేసే వారికి ఈ కేసు గుణపాఠంగా, కనువిప్పు కలిగేలా చేసిందని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్  తెలిపారు.

ఈ కేసును 10 నెలల్లోనే దర్యాప్తు, ట్రయలు పూర్తి చేయించి , సాక్షులను, సాక్ష్యా ధారాలను ఎప్పటికప్పుడూ హాజరు పరచిన పోలీసు అధికారులను మరియు ఈ కేసు వాదించిన పబ్లిక్ ప్యాసిక్యూటర్ వై. ప్రకాష్ రెడ్డి ని జిల్లా ఎస్పీ  ప్రత్యేకంగా అభినందించారు.

ఇది అంతయు రాష్ట్ర డిజిపి  ఆదేశాల వలనే సాధ్యం అయినదని జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్ ఐపియస్  తెలిపారు.

 

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!