పద్మ అవార్డులు – 2027 కొరకు అర్హులైన వ్యక్తుల నుండి నామినేషన్ల ఆహ్వానం

పద్మ అవార్డులు – 2027 కొరకు అర్హులైన వ్యక్తుల నుండి నామినేషన్ల ఆహ్వానం
కర్నూలు ప్రతినిధి జూన్ 10 యువతరం న్యూస్:
గణతంత్ర దినోత్సవం–2027 సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించనున్న పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫారసులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ తెలిపారు. మహిళా సాధికారత, బాలల అభివృద్ధి, బాలల సంరక్షణ, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను పద్మ అవార్డుల కోసం సిఫారసు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో మహిళలు మరియు బాలల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు మరియు ఇతర అర్హుల వివరాలను సంబంధిత ఆధారాలతో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖకు పంపించాలని కోరారు. అర్హులైన వ్యక్తుల వివరాలు, వారి సేవల సంక్షిప్త నివేదిక, సంప్రదింపు వివరాలు తదితర సమాచారాన్ని 15 జూన్ 2026 లోపు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ తెలిపారు.



