వాజేడు మండలం అయ్యవారిపేట ఇసుక క్వారీలో ఘరానా దందా
అధికారులు జర చూడండి

వాజేడు మండలం అయ్యవారిపేట ఇసుక క్వారీలోఘరానా దందా
కలెక్టర్ అమ్మ జర పట్టించుకోండి
అక్రమాల పుట్ట ఇసుక క్వారీ అయ్యవారిపేట
యదేచ్చగా డబ్బులువసూల్ దందా…..????
నేల చూపులు చూస్తున్న సీసీ కెమెరాలు
భారీ యంత్రాలతో నైట్ డంపింగ్ ఉదయం లోడింగ్
కనిపించని మ్యాన్ పవర్
దారికి ఇరువైపులా మొక్కలు నాటలే
తట్టా,పారా, ట్రాక్టర్ తో డంపింగ్ అనేది మైనింగ్ శాఖ అధికారుల మాయమాటలే
కింద నుండి పై వరకు అధికారులకు తెలిసిన పట్టించుకోని వైనం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
వాజేడు ఏప్రిల్ 5 యువతరం న్యూస్:
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ని అయ్యవారిపేట లోని నిర్వహిస్తున్న ఇసుక క్వారీ అక్రమాలకు అడ్డుగా సాగుతుంది, క్వారీ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ లోడింగ్ కోసం లారీ డ్రైవర్ల దగ్గర 1500 తీసుకోవాలి కానీ 3500 వరకు వసూలు చేస్తున్నారు, పాసింగ్ నడుస్తుందని నమ్మబలికి ఎగస్ట్రా ఇసుక తరలించే క్రమంలో నాలుగవ తారీఖున ఒక లారీని ఎగస్ట్రా లోడుతో సీజ్ అయినా సంఘటన పాఠకులకు విధితమే క్వారీ నిర్వహణ కోసం నిర్వహించే గ్రామ సభలో మైనింగ్ అధికారులు అడిషనల్ కలెక్టర్ ఎదురుగా ఇసుక నిర్వహణ మ్యాన్ పవర్ అంటే గ్రామంలోని ప్రజలతో పని చేపిస్తామని తట్టా పారా గ్రామంలోని ట్రాక్టర్స్ తో లోడింగ్ చేయిస్తాము గొప్ప మాటలు చెబుతారు,గాని అయ్యవారిపేట ఇసుక విషయంలో అలా ఎందుకు జరగడం లేదు క్వారీ వద్ద టిప్పర్స్, లారీలు ఎందుకోసం ఉంటున్నాయి అధికారులకు కనిపించడం లేదా కావాలనే మౌనంగా ఉంటున్నారా అధికారుల అలసత్వం గ్రామ ప్రజలకు శాపంగా మారింది టిప్పర్స్ లారీలు అందుబాటులో ఉంచుకున్న రేజింగ్ కాంట్రాక్టర్ అదే అదునుగా భారీ యంత్రాలు సాయంతో రాత్రివేళలో ఇసుక డంపింగ్ చేస్తు గ్రామాల్లోని ట్రాక్టర్ యజమానుల నోట్ల మన్ను కొడుతున్నారు, క్వాలిటీ ఇసుక కోసం నడి గోదారి లోపలికి దారి వేసుకున్న రేజింగ్ కాంట్రాక్టర్ 10 నుండి 18 అడుగుల లోతు వరకు ఇసుక తీస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇట్టి విషయాలు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విజిలెన్స్ అధికారులు అయ్యవారిపేట ఇసుక క్వారీ పై సమగ్ర సర్వే విచారణ జరిపించి స్థానిక ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.