రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిన వైసిపి

రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి పెన్షన్ ఇవ్వకుండా తెదేపా పై నిందలు వేయడం సిగ్గు చేటు
తక్షణమే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగ తదితరులు పెన్షన్ లు ఇంటి వద్దకు వెళ్లి పంపిణి చేయాలి
నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కు నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి వినతి పత్రం
నంద్యాల కలెక్టరేట్ ఏప్రిల్ 3 యువతరం న్యూస్:
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీచేసి వృద్దులు, దివ్యాంగులు, వితంతు తదితరుల పెన్షన్ ఇవ్వకుండా తెదేపా పై అవాస్థవ ప్రచారం చేయడం ఛిగ్గుచేటని నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
మంగళవారం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డికి తక్షణమే పెన్షన్ పంపిణికి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా కలెక్టరేట్ ఆవరణలో బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటర్లు పెన్షన్ పంపిణి చేయరాదని ఆదేసించిందన్నారు. వాలంటీర్లు కాకుండా సచివాలయ, ఎం పి డి ఓ కార్యాలయ ప్రభుత్వ అధికారులచే పెన్షన్ పంపిణి చేయకుండా ప్రతిపక్షం టీడీపీ పై నిందలు వేసి చేతులు దులుపుకోవడం అన్యాయం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అని ప్రజలకు తెలుసని, మళ్ళీ జగన్ ప్రభుత్వం రాదని గృహించి వై సి పి కాంట్రాక్టులకు మాత్రమే బిల్లులు చెల్లించి పెన్షన్ పంపినికి నిధులు లేకుండా చేసారని ఆమె ఆరోపించారు.
జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్వంధించి అర్హుల పెన్షన్ తక్షణమే ఇంటివద్ద అందించేలా చర్యలు తీసుకోవాలని బైరెడ్డి శబరి వినతి పత్రం ధ్వారా కోరారు.