ANDHRA PRADESHSOCIAL SERVICE
జింక పిల్ల పోలీసులకు అప్పగింత

జింక పిల్ల పోలీసులకు అప్పగింత
వన్య ప్రాణులను ప్రతిక్కరూ బాధ్యతగా కాపాడాలి
ఎస్ఐ రమేష్ బాబు
(యువతరం మార్చి 23)
మద్దికెర విలేఖరి:
మండలకేంద్రమైన మద్దికేర బుగ్గ సమీపాన జింకపిల్లను కుక్కలు తరుముతుండగా మద్దికేరకు చెందిన చందు, సాయి గమనించి జింకపిల్లను కుక్కల బారి నుండి కాపాడారు. ఈ మేరకు వారు జింక పిల్లను మద్దికేర పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రమేష్ బాబుకు అప్పగించారు. ఆపదలో ఉన్న వన్య ప్రాణులను ప్రతిఒక్కరు బాధ్యతగా కాపాడాలని సూచించారు. జింక పిల్లను అప్పగించిన వారిని ఆయన అభినందించారు. ఫారెస్ట్ వాళ్లకు సమాచారం అందించి జింక పిల్లను ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు.