ANDHRA PRADESHOFFICIAL

908 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (విఓఎ స్) లకు శాంసంగ్ 5జి స్మార్ట్ ఫోన్లు పంపిణీ

908 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (విఓఎ స్) లకు శాంసంగ్ 5జి స్మార్ట్ ఫోన్లు పంపిణీ

స్వయం సహాయక సంఘాల సేవలకు సాంకేతిక బలం

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు ప్రతినిధి ఏప్రిల్ 24 యువతరం న్యూస్ :

గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (విఓఎ స్) లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో డి.ఆర్.డి.ఎ-సెర్ప్ కు సంబంధించిన వివోఏ లకు మొబైల్ ఫోన్స్ ను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసే దిశగా జిల్లాలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ స్మార్ట్‌ఫోన్లు కీలకంగా ఉపయోగపడతాయన్నారు. జిల్లాలోని మొత్తం 908 మంది విఓఎ లకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యాధునిక 5జి సదుపాయం కలిగిన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్లు గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సంఘాల ఆర్థిక లావాదేవీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం సులభతరం అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వేగవంతంగా గ్రామీణ ప్రజలకు చేరవేయడంలో స్మార్ట్‌ఫోన్లు కీలకంగా ఉపయోగపడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సాంకేతికత వినియోగం మరింత విస్తరించాలని, విఓఎస్ ఈ సదుపాయాన్ని సమర్థంగా వినియోగించి సంఘాల పురోగతికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి రమణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!