యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి


యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
జిల్లా పోలీసు కార్యాలయంలో ఈగల్ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
కర్నూలు ప్రతినిధి జూన్ 10 యువతరం న్యూస్ :
డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన బ్రోచర్లు, వాల్ పోస్టర్ల ను ఆవిష్కరించిన…
సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్.
డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ మైదానంలో ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన బ్రోచర్లు, వాల్ పోస్టర్ల ను ఆవిష్కరించారు. అలాగే పోలీసు అధికారులు, సిబ్బందితో యోగా, యోగాసనాలు నిర్వహించారు. హోంగార్డు కమాండెంట్ శ్రీ మహేష్ కుమార్ మాట్లాడుతూ …మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ అలవాటు వ్యక్తి, కుటుంబం, సమాజ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.
అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ లు మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అవసరమని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించారు. అలాగే ఎన్డీపీఎస్ చట్టం-1985పై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించి, ఈగల్ విభాగం చేపడుతున్న వివిధ అవగాహన, నిరోధక చర్యల గురించి వివరించారు.
మత్తు పదార్థాల నిర్మూలనకు కర్నూలు పోలీసులు, ఈగల్ టీం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో హోంగార్డు డిఎస్పీ ప్రసాద్, ఆర్ ఐలు, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది , హోంగార్డులు, ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎలీషా, ఈగల్ టీం కానిస్టేబుల్ రమేష్ ల్గొన్నారు.



