మంగళగిరిలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

మంగళగిరిలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
మంగళగిరి పట్టణంలో ప్రచారం నిర్వహించిన కూటమి నాయకులు
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 13 యువతరం న్యూస్:
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మద్దతుగా బుధవారం మంగళగిరి పట్టణంలో నాయకులు ప్రచారం నిర్వహించారు. శ్రీ చైతన్య స్కూలు, నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య కాలేజీ, రవీంద్రభారతి స్కూలు అధ్యాపకులు, టీచర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి విజయం చేకూర్చాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతోందన్నారు. గ్రాడ్యుయేట్ సమస్యలను శాసనమండలిలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వినిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, మంగళగిరి నియోజకవర్గ టిఎన్‌టియూసి ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు కొల్లి వేణు, కారంపూడి శివరామకృష్ణ, సార మేకల గంగాధర్ రావు, చెల్లూరి వీర వెంకట సత్యనారాయణ, పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షుడు మహమ్మద్ అరీఫ్, జింక మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.