ANDHRA PRADESHOFFICIAL

పాణ్యం చెంచు కాలనీలో 167 గృహాలు మంజూరు

పాణ్యం చెంచు కాలనీలో 167 గృహాలు మంజూరు

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల కలెక్టరేట్ ఫిబ్రవరి 12 యువతరం న్యూస్:

ప్రధానమంత్రి జన్‌మన్‌ పథకం కింద చెంచు గిరిజన లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. మంగళవారం పాణ్యం మండల కేంద్రంలోని చెంచు కాలనీని స్థానిక శాసన సభ్యురాలు గౌరు చరిత రెడ్డి తో కలిసి కలెక్టర్ సందర్శించారు. హౌసింగ్ పీడీ హరిహర గోపాల్, డ్వామా పిడి వెంకటసుబ్బయ్య, హౌసింగ్ అధికారులు తదితర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్‌మన్‌ పథకం కింద పాణ్యం చెంచు కాలనీలో 167 గృహాలు మంజూరు అయ్యాయని మంజూరైన లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.39లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు. పొదుపు లక్ష్మి గ్రూపుల్లో ఉన్న మహిళలకు 35,000 నుండి లక్ష రూపాయల వరకు గృహాలు నిర్మించుకునేందుకు రుణ సౌకర్యం కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. పాణ్యం చెంచు కాలనీలో ఇప్పటికే 10 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని… మరో పది గృహాలకు ఎమ్మెల్యే తో కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గృహాలు మంజూరు అయిన ప్రతి ఒక్కరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చెంచు కాలనీలో ఇల్లు నిర్మించుకుంటే రోడ్లు, కాలువలు, త్రాగునీటి వసతి, వీధిలైట్లు తదితర మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతుందన్నారు. ఆధార్ లేని కాలనీవాసులకు ఆధార్ ఇప్పించే మార్గం ఏర్పాటు చేస్తానని కలెక్టర్ తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!