కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవిస్తుంది

కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవిస్తుంది
పట్టబద్రులందరూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలి
టిడిపి గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరు మైనర్ బాబు
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 14 యువతరం న్యూస్:
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఉపాధ్యాయులు మద్దతుగా నిలవాలని మంచి వ్యక్తిని శాసనమండలిలోకి పంపితే ప్రజలకు మేలు జరుగుతుందని టిడిపి గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ వేమూరి మైనర్ బాబు విస్తృత ప్రచారం చేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయులు, లెక్చరర్స్ నీ కలిసి కూటమి పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కనీసం జీతాలు కూడా ఒకటో తేదీకి అందించలేక పోయిందని ఆయన అన్నారు. నాడు మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను విధులు విధులను కేటాయించిన పరిస్థితి ఉందని ఆయన గుర్తు చేశారు. యాప్ లతో ఉపాధ్యాయులను ఉక్కిరి బిక్కిరి చేసేవారని, పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత బాధ్యత కూడా వారిపై పెట్టి చులకనగా చూసేవారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులను గౌరవిస్తూ పాలన సాగిస్తున్నారని వేమూరి మైనర్ బాబు అన్నారు. నిరుద్యోగ యువత జీవితాలను చక్కబెట్టేందుకు గాడి తప్పిన రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ కూటమి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తుందని, త్వరలోనే రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు రానున్నాయన్నారు. భారీ పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాల కల్పన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సరికొత్త ఆలోచన విధానాలతో ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు పట్టాభద్రులందరూ మద్దతుగా నిలవాలని మైనర్ బాబు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రుద్రు కోటేశ్వరరావు, కట్టేపోగు ముత్తయ్య, షేక్ మస్తాన్, మర్రి ఏసుబాబు,కొత్త శ్రీనివాస్,తోట శ్రీనుబాబు, షేక్ నజీర్, బత్తుల నాగరాజు,పైల రవి, షేక్. హనాన్ తదితరులు పాల్గున్నారు.