ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS
ఏపీలో రిజిస్ట్రేషన్ల పై కీలక నిర్ణయం

ఏపీలో రిజిస్ట్రేషన్ల పై కీలక నిర్ణయం
అమరావతి ప్రతినిధి ఫిబ్రవరి 14 యువతరం న్యూస్:
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సబ్జిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకునేలా ఈ సిస్టమ్ను తీసుకొచ్చారు. ఆన్లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రజలు వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్జిస్ట్రార్కు ప్రత్యేక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందని స్పష్టం చేశారు.