ANDHRA PRADESHEDUCATION

అంగరంగ వైభవంగా వెల్దుర్తి పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా వెల్దుర్తి పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తాము,ముక్తకంఠంతో నేతలు

వెల్దుర్తి ఫిబ్రవరి 15 యువతరం న్యూస్:

మండల కేంద్రమైన వెల్దుర్తిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ద్వితీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రావతి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రాజేష్ ల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్, జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, తెలుగు యువత నాయకులు సుధాకర్ గౌడ్, ప్రముఖ పారిశ్రామికవేత్త సాయి ప్రసాద్, మాజీ జెడ్పిటిసి ఐజయ్య, జడ్పిటిసి సుంకన్న, ఎంఈఓ ఇందిర, బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శైలజ, ప్రతిభ కరస్పాండెంట్లు, వెల్దుర్తి మేజర్ పంచాయతీ సెక్రెటరీ లక్ష్మీ నాథ్ మరియు పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విద్యార్థినిల తల్లిదండ్రులు హాజరు కావడం గమనార్హం. వచ్చిన వారందరికీ పాఠశాలల్లో విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నామని నాయకులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి పదవ తరగతిలో 90 శాతం ఉత్తీర్ణత సాధిస్తే విద్యాశాఖ మంత్రిని వెల్దుర్తికి పిలుచుకొని వస్తానని జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బరాయుడు హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి ఎంతటి కష్టమైన ఎదుర్కొంటానని మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. అదేవిధంగా 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి లో ఎవరు మొదటి స్థానం వస్తే వారికి పదివేల రూపాయలు నజరానా ను ముందుగానే తెలుగు యువత నాయకులు సుధాకర్ గౌడ్ ప్రధానోపాధ్యాయురాలుకు అందించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!