ANDHRA PRADESHHEALTH NEWS
సీఎం సురేష్ నాయుడును పరామర్శించిన రజక సంఘం నాయకులు

సీఎం సురేష్ నాయుడును పరామర్శించిన రజక సంఘం నాయకులు
ఎర్రగుంట్ల సెప్టెంబర్ 13 యువతరం న్యూస్:
ప్రొద్దుటూరు రజక సంఘం నాయకులు ఇటీవల ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కాలు ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న పొట్లదుర్తి సీఎం సురేష్ నాయుడును పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. దేవుని కృపతో సురేష్ నాయుడు త్వరగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ప్రొద్దుటూరు రజక సంఘం గౌరవ అధ్యక్షులు సి. బాలసుబ్బయ్య, అధ్యక్షులు పి. బాలసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కులాయప్ప, ఏ. శ్రీనివాసులు, పి. శ్రీనివాసులు, విశ్వ, తదితరులు పాల్గొన్నారు.



