ANDHRA PRADESHCRIME NEWS

విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేసిన యువకుడు అరెస్ట్

విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేసిన యువకుడు అరెస్ట్

వెల్దుర్తి సెప్టెంబర్ 3 యువతరం న్యూస్:

కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో జడ్పీ హైస్కూల్ బాయ్స్ నందు శ్రీనివాస్ గౌడ్ అక్రమంగా స్థలాన్ని ఆక్రమించుకుని అందులో లెట్రిన్ గుంత త్రవ్వగా సదరు గుంతలు పూడ్చుటకు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రామ్ నాయక్ 12-08-26 తేదీ పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరగా, హెడ్మాస్టర్ కోరిన మేరకు వెల్దుర్తి పిఎస్ నుండి కానిస్టేబుల్ రాంబాబు మరియు హోంగార్డ్ వెంకట్ రాముడు సదరు గుంతలు పూడ్చే క్రమంలో విధులు నిర్వహిస్తుండగా, అప్పుడు అక్కడికి శ్రీనివాస్ గౌడ్ కుమారుడు భరత్ గౌడ్ అక్కడికొచ్చి విధులు నిర్వహిస్తున్న రాంబాబుపై దురుసుగా ప్రవర్తించి అతని షర్టు కాలర్ పట్టుకొని ఉద్యోగం పీకిస్తానని మరియు అతని బెదిరించి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నందు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయినది అని ఎస్ఐ నరేష్ తెలిపారు. 😭 సదరు ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా బుధవారం భరత్ గౌడ్ ను అతని ఇంటి ముందర అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం అయినది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడమేమనగా ఎవరైనా పోలీసు విధులకు ఆటంకం పరిచిన, పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన మరియు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిపై విధులు కు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారిపై ఇదేవిధంగా కేసు నమోదు చేసి చట్టపరంగా చర్య తీసుకుని రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఇతర డిపార్ట్మెంట్లోని ప్రభుత్వ ఉద్యోగుల తో చట్టపరంగా పని చేయించుకోవాలి తప్ప , వారి విధులకు ఆటంకపరచడం మరియు వారిని భయభ్రాంతులకు గురిచేసి దురుసుగా ప్రవర్తించడం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్సై నరేష్ తీవ్రంగా హెచ్చరించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!