

శ్రీలక్ష్మి గణ మద్దిలేటి స్వామి వారి పాలక మండలి ప్రమాణ స్వీకారం.
డోన్ ప్రతినిధి ఆగస్టు 23 యువతరం న్యూస్:
బేతంచర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో వెలసిన మద్దిలేటి నరసింహ స్వామి దేవస్థానంలో ధర్మకర్త మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ధర్మకర్త మండలి సభ్యులను అభినందించి,వారి బాధ్యతలు ఎంతో కీలకమైనవని తెలిపారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ,దేవస్థానం అభివృద్ధి,నిర్వహణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులు సమావేశమై,ఉన్నం ఎల్ల నాగయ్య ని ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ ఉన్నం ఎల్ల నాగయ్య కి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.



