ANDHRA PRADESHCRIME NEWSSTATE NEWS

వెల్దుర్తిలో పోలీస్ సిబ్బందిపై పాఠశాల ఆక్రమణదారుడు దాడి

వెల్దుర్తిలో పోలీస్ సిబ్బందిపై పాఠశాల ఆక్రమణదారుడు దాడి

సంవత్సరం క్రితం ఆక్రమణదారులకు నోటీసులు జారీ

రెచ్చిపోతున్న ఆక్రమణదారులు

జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ఆక్రమణలు ఎప్పుడు తొలగిస్తారు

వెల్దుర్తి ఆగస్టు 16 యువతరం న్యూస్:

మండల కేంద్రమైన వెల్దుర్తిలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ కు సంబంధించిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారింది. ఆర్ అండ్ బి మరియు జిల్లా పరిషత్ బాలల హైస్కూల్ కు సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమణదారులు ఆక్రమించుకోవడం జరిగింది. అదేవిధంగా హైస్కూల్ ఆవరణంలో ఆక్రమణదారులు గుంతలు త్రవ్వి మల, మూత్ర, విసర్జన మలినాలను వదలడం జరిగింది. వీధి తొలగింపునకు సహకరించవలసిందిగా పాఠశాల హెచ్ఎం రామనాయక్, ఇన్చార్జి హెచ్ఎం అల్లా బకాష్ మరియు సిబ్బంది స్థానిక ఎస్ఐ ను కోరడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 12 బుధవారం ఒక కానిస్టేబుల్ విధి నిర్వహణ నిమిత్తం జిల్లా పరిషత్ బాలర హై స్కూల్ కు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆక్రమణ దారులు విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఇదే స్థలానికి సంబంధించి సర్వే నంబర్లు 259,249 లలో ఆక్రమణలు తొలగించాలని 2025 ఆగస్టు 18 నాటి కర్నూలు జడ్పీ సీఈవో ఆదేశాల మేరకు ఆనాటి వెల్దుర్తి మేజర్ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాద్ జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ఆవరణంలో ఉన్న 30 షాపులకు సంబంధించి 15 మంది యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసి దాదాపు ఒక సంవత్సరం కావస్తుంది. నోటీసులు ఇచ్చి అధికారులు తదుపరి చర్యలు నేటి వరకు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ప్రశ్న. ప్రస్తుతం నేటి జడ్పీ సీఈఓ ఆదేశాల మేరకు వెల్దుర్తి మండల ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ కు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. వివరాలను జడ్పీ సీఈఓ కు తెలుపుతామన్నారు. ఇలా ఆక్రమణదారులు పోలీస్ సిబ్బందిపైనే దాడులు చేస్తే మరి సామాన్యుల మాట ఏమిటంటే ప్రశ్న. స్థానిక రెవెన్యూ అధికారులు బాలుర హై స్కూల్ కు సంబంధించి సర్వే నిర్వహించడం జరిగింది. మరి ఆక్రమణలు తొలగించడంలో జాప్యం ఎందుకని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హై స్కూల్ ఆవరణంలో ఉన్న గుంతలలో పడే విద్యార్థులకు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు అన్నది ప్రజలకు అధికారులు జవాబు చెప్పవలసిందే. అధికారులు విచారణలకే పరిమితం అవుతారా లేక ఆక్రమణలు తొలగిస్తారా అన్నది వేచి చూడవలసిందే.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!