ANDHRA PRADESHPOLITICSSTATE NEWS

వెల్దుర్తి జడ్పిటిసి తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం

వెల్దుర్తి జడ్పిటిసి తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘన విజయం

వెల్దుర్తి నవంబర్ 7 యువతరం న్యూస్:

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల జడ్పిటిసి తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు భారీ ఓట్లతో ఘనవిజయం సాధించారు. మొత్తం 28,980 ఓట్లు పోల్ కాగా అందులో తెదేప అభ్యర్థి శైలజ సుబ్బరాయుడుకు 22,641 ఓట్లు రాగా, బి.ఎస్.పి అభ్యర్థికి 4895 ఓట్లు రావడం జరిగింది. నోటాకు 626 ఓట్లు, చెల్లని ఓట్లు 767 గా నమోదు అయ్యాయి. 17746 ఓట్ల ఆదిత్యంతో తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం సాధించారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!