ANDHRA PRADESHPROBLEMS
నేరేడుచర్లలో గ్యాస్ సిలిండర్ ఫైర్


నేరేడుచర్లలో గ్యాస్ సిలిండర్ ఫైర్
ప్యాపిలి సెప్టెంబర్ 22 యువతరం న్యూస్:
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.
గ్రామానికి చెందిన గంగిశెట్టి శేషావతి వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని టీవీ, ప్రైజ్ స్లాబ్ తదితర వస్తువులు కాలిపోయాయి
మంటలను గమనించిన స్థానికులు వెంటనే ప్రియా సిమెంట్‌కు చెందిన ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో సుమారు రెండు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.



