స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్ ఘనవిజయం

స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్ ఘనవిజయం
వెల్దుర్తి నవంబర్ 7 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని ఎంపీటీసీ 1 ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇందులో జనసేన, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి ముక్కోనపు పోటీ జరిగింది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ లో జనసేన మరియు బీఎస్పీ అభ్యర్థులకు ఒక్కొక్క ఓటు రాగా స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ గౌడ్ కు రెండు ఓట్లు రావడం జరిగింది. ఎన్నికల ఫలితాలు చివరి సమయానికి స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్ కు 1266 ఓట్లు రాగా, జె ఎస్ పి అభ్యర్థికి 208 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థికి 260 ఓట్లు రావడం జరిగింది. దాదాపు 1005 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ అభ్యర్థి గుండ్రాది సుధాకర్ గౌడ్, ఘనవిజయం సాధించినట్లు అభ్యర్థులు ప్రకటించారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.



