గండిని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

గండిని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
అనంతపురం ప్రతినిధి డిసెంబర్ 11 యువతరం న్యూస్
పుట్లూరు మండలం,సుబ్బరాయ సాగర్ గేట్లను ఎత్తి,నీటిని విడుదల చేశామని అయితే చింతకుంట (14.7km) కెనాల్ దగ్గర కల్వర్టు కూలడంతో నీరు వృధాగా పోతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి అర్ధరాత్రి అధికారులతో కల్సి హుటాహుటిన బయలుదేరి గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు.నీటి ప్రవాహాన్ని కట్టడిచేసి ఎక్కడైతే గండిపడిందో వెంటనే అక్కడ మారమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు.ఎమ్మెల్యే బండారు శ్రావణి అధికారులతో మాట్లాడుతూ వీలైనంత తొందరగా గండినీ బుడ్చే మరమ్మత్తు పనులు చేసి పుట్లూరు చెరువు,
కోమటికుంట్ల,గరుగు చింతలపల్లి చెరువులకు నీరు చేరాలని సూచించారు. కూలిన కల్వర్టు వలన నీరు సకాలంలో చెరువులకు రావేమో అని రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు తెలిపారు.కూటమి ప్రభుత్వం చెప్పినట్లు పుట్లూరు, కోమటికుంట్ల, గరుచింతలపల్లి చెరువులకు కచ్చితంగా నీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. 48 గంటల్లోపు 70 శాతం గండి పూడ్చడం పనిని పూర్తి చేపించామని మరి కొంత మిగిలి ఉన్న పనిని కూడా త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.ఈ కార్యక్రమంలో పుట్లూరు,కోమటికుంట్ల గరుగు చింతలపల్లి, చింతకుంట,గ్రామ రైతులు పాల్గొన్నారు