అనారోగ్యంతో మృతి చెందిన మరో గిరిజన విద్యా కుసుమం

అనారోగ్యంతో మృతి చెందిన మరో గిరిజన విద్యా కుసుమం
పార్వతీపురం మాన్యం ప్రతినిధి డిసెంబర్ 17 యువతరం న్యూస్:
గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పత్తిక దినేష్ ఈరోజు మృతి చెందడం చాలా బాధాకరం. ఇటీవల కాలంలో ఎక్కువగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మృతి చెందడం జరుగుతుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన శాఖ ఉన్నతాధికారులు,గిరిజన శాఖ మంత్రివర్యులు దీనిపై శ్రద్ధ చూపించి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మరణాలను అరికట్టాలని ట్రైబల్ రైట్స్ ఫోరం , గిరిజన అభ్యుదయ సంఘం ఆదివాసి,ఆదివాసి జేఏసీ నాయకులు కోరడం జరుగుతుంది. మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులకు ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇవ్వాలని వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రోబ్బా లోవరాజు, జిల్లా అధ్యక్షులు ఇంటికుప్పల రామకృష్ణారావు, గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్, ఆదివాసి జేఏసీ జాయింట్ సెక్రెటరీ దుక్క సీతారాం,బలక్రిష్ణ పాల్గొన్నారు.