అమ్మ పాలు అమృతం

అమ్మ పాలు అమృతం
అమ్మ పాలు అమృతంతో సమానం
శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం
అమ్మ పాలే
వజ్ర సమానమైన రోగనిరోధక శక్తినిచ్చేది తల్లిపాలే/
బిడ్డకు రోగాలు రాకుండా రక్షణ కవచం తల్లిపాలు
పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఆరు నెలలు వరకు ఇస్తే
బిడ్డకు వజ్రాయుధం/
మొదటి మూడు రోజులు ఇచ్చే పాలు ముర్రూపాలు
బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు/
బిడ్డకు రోగనిరోధక శక్తితో పాటు అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది తల్లిపాలు తాగటం వల్ల బిడ్డకు ఎటువంటి వ్యాధులు రావు /
బిడ్డకు తల్లిపాలు ఒక రక్షణ తెర
తల్లిపాలు బిడ్డకు వరం లాంటిది
అద్భుత శక్తినిచ్చే ఇంధనం అమ్మ ఉదయం ఆత్మీయతతో పొంగి బిడ్డకు ప్రేమ సుగంధాన్ని ఆరోగ్యాన్ని పంచుతుంది పాలతో
ఆకాశమంత ఆరోగ్యాన్ని అందిస్తుంది
పాలతో/
తల్లిపాలు పుష్కలంగా రావాలంటే
పోషక విలువలు గల ఆహారం
పాలు చాపలు గుడ్లు వెల్లుల్లిపాయ కూరగాయలు పండ్లు తీసుకోవాలి/
తల్లిపాలు శిశువుకుసంపూర్ణ ఆహారం
నాణ్యమైన ప్రోటీన్లు
అంది శిశువుమెదడు వికసిస్తుంది
తల్లిపాలలో బిడ్డకు అవసరమయ్యే విటమిన్లు పుష్కరంగా ఉంటాయి/
వ్యాధులు రాకుండా శిశువుని కంటికి రెప్పలాకాపాడుతుంది
బిడ్డకు మనోవికాసానికి ఉపయోగపడుతుంది/
బాల్యంలోనూ యవ్వనంలోను ఉబకాయం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది/
పాలు ఇవ్వడం వల్ల గర్భాదారణ తర్వాత రక్త స్రావం అయ్యే ప్రమాదం తగ్గుతుంది తల్లి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది/
ఇటలీదేశంలో ఇన్సోసియేట్ సెంటర్లో 1990 జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి తల్లిపాల విశిష్టత గురించి
ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి వారం రోజులు పాటు జరుపుకోవాలని నిర్ణయించారు
తల్లిపాలు గొప్పతనం అందరికీ తెలపటమే దీని ఉద్దేశం/
డాక్టర్ నల్లా నరసింహమూర్తి
సీనియర్ తెలుగు లెక్చరర్
శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు