సెక్యూరిటీ గార్డ్ లు సిఐటియు లో చేరిక

నంద్యాల పట్టణంలోని మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ సిఐటియులో చేరిక
నంద్యాల ప్రతినిధి ఆగస్టు 3 యువతరం న్యూస్:
నంద్యాల పట్టణంలో నీ నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సిఐటియు కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి బాలయ్య అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీ, యేసు రత్నం ఏ, నాగరాజు సిఐటియు జిల్లా కార్యదర్శి వీ, బాల వెంకట్ లు పాల్గొని మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు కనీస వేతనం అమలు చేయాలని వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని ప్రతినెల స్లిప్పులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ అలాగే మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సెక్రెటరీ కు నూతన కమిటీని ఏకీభవంగా ఎన్నుకోవడం జరిగింది కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఏ, నాగరాజు గౌరవ సలహాదారులుగా వి, బాల వెంకట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్షులుగా బాలయ్య కార్యదర్శిగా చెన్నయ్య కోశాధికారిగా నాగన్న సహాయ కోశాధికారిగా సుమలత ఉపాధ్యక్షులుగా రమేష్ బాబు సురేఖ ఆదినారాయణ హైమావతి తోపాటు 22 మందిని కమిటీ సభ్యులు గా ఏకీభవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు సమావేశానికి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రసాదు గురు స్వామి మద్దతు తెలిపారు ఈ ఈ జనరల్ బాడీ సమావేశంలో మెడికల్ కాలేజీ సెక్యూరిటీ గార్డ్స్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ దాదాపు 60 మంది పాల్గొన్నారు.