ఆంధ్రప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కంభంపాటి

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కంభంపాటి
మంగళగిరి ప్రతినిధి జులై 31 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన కంభంపాటి ప్రసాదరావు ను నియమిస్తూ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరి తెనాలి రోడ్డులోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద బుల్లా రాజారావు ప్రసాదరావుకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం రాజారావు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన ప్రసాదరావు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంతోపాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి వేమవరపు రాము, నాయకులు కంభంపాటి జయరాం, మేకల మీరయ్య, కంభంపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.