DEVOTIONALTELANGANAWORLD

గణేశ్ లడ్డూ వేలంలో సర్పంచ్ శేఖర్ హవా

గణేశ్ లడ్డూ వేలంలో సర్పంచ్ శేఖర్ హవా

లడ్డూ వేలంలో రూ.4.50 లక్షలు.. గడ్డంపల్లి సర్పంచ్ కైవసం

నాగర్ కర్నూల్ ప్రతిని సెప్టెంబర్ 22 యువతరం న్యూస్:

గణనాథుని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ గణేశ్ లడ్డూ వేలంలో నాగర్ కర్నూల్ జిల్లా గడ్డంపల్లి గ్రామ సర్పంచ్ వెన్నెల శేఖర్ లడ్డూను దక్కించుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలం పాటలో తెలకపల్లి మండల పరిధిలోని గడ్డంపల్లి గ్రామ సర్పంచ్ వెన్నెల శేఖర్ పాల్గొన్నారు. వేలం పాటలో రూ.4 లక్షల 50 వేల మొత్తానికి గణేశ్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెన్నెల శేఖర్ మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గణేశుని అనుగ్రహం గడ్డంపల్లి గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు. గణేశ్ లడ్డూ వేలం ద్వారా లభించిన లడ్డూను భక్తి శ్రద్ధలతో స్వీకరించినట్లు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో గ్రామ ప్రజలకు మంచి జరగాలని, గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ఈ లడ్డూ వేలం కార్యక్రమం భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!