శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు


శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు
కొత్తపల్లి జూలై 14 యువతరం న్యూస్:
మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామంలో వెలసియున్న శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సామి అమ్మవార్లకు ప్రత్యేకంగా సోమవారం అభిషేక పూజలు కుంకుమార్చన రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి అనంతరం గ్రామంలోని మహిళలు పిల్లలు పెద్దలు అందరు కలిసి కాయ కర్పూరం స్వామి వారికి సమర్పించి దర్శించుకున్నారు. జులై 13.. వందేళ్లకు ఒకసారి వచ్చే రోజు జూలై 13న అత్యంత అరుదైన ‘మహాశైవాక్షయోగం’ ఏర్పడుతోంది. వందేళ్లకోసారి వచ్చే ఈ రోజున శివారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగి, సుఖసంతోషాలు చేకూరుతాయని సూచిస్తున్నారు. భక్తితో చేసే చిన్న పూజ కూడా శివుడి అనుగ్రహాన్ని కలిగిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వివరిస్తున్నారు.



