
రెవెన్యూ డివిజన్ బస్సుడిపో పునర్ నిర్మాణం కోసం బిజెపికీ ఒక్క అవకాశం ఇవ్వండి మాజీ ఎం పి పి డా.జాడి రామరాజునేత
(యువతరం ఆగష్టు 19) ములుగు ప్రతినిధి.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో భారతీయ జనత పార్టీ మాజీ ఎం పి పి కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సూదిర్గకాలంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ నాటి తెలుగుదేశం నేటి బి ఆర్ ఎస్ పార్టీ తోకపార్టీ అయినా సిపిఎం సిపిఐ పార్టీలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నియోజకవర్గన్ని అభివృద్ధికీ నోచుకోకుండా చేసినటువంటి చరిత్ర సుధీర్గంగా కాలంగా పరిపాలించిన పార్టీలదే అని డా. జాడి రామరాజు నేత అన్నారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్నీ నియోజకవర్గ కేంద్రల్లో ప్రజల అభివృద్ధి కోసం రాకపోకల కోసం అన్ని నియోజకవర్గల్లో ఉన్నపటికీ ములుగు లో బస్సు డిపో లేకపోవడం బాధాకరం అని అన్నారు. ఏటూరునాగారంలో నాటి నుండి నేటి వరకు అన్ని పార్టీ నాయకులు ప్రజల్ని మోసం చేస్తూ ఏటూరునాగారం బస్సు డిపో నిర్మిస్తామని అని చెప్పేవారు ఉన్నారు కానీ గెలిచినా తరువాత ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం ఏంటి అన్నారు. ఇప్పటికి కూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు టి ఆర్ ఎస్ నాయకులు అడ్వాటేజింగ్ లో ముందు ఉన్నారు కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ కనపడటం లేదని అన్నారు. ఇప్పటికి ఆదివాసులం అని చెప్పుకునే రాజకీయలు చేసే నాయకులకు దొడ్లమల్లెల, కాంతనపల్లి, కొండయి,ఐలపురం నుండి కన్నాయిగూడెం మండల కేంద్రనికి రోడ్లు లేకపోవడం బాధాకరం అని అన్నారు. అదే విధంగా ఇప్పటికైనా ములుగు నియోజకవర్గ ప్రజలు ఆదివాసీల దళిత బహుజనవర్గాల అభివృద్ధికీ ఒక్క అవకాశం ఇస్తే ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్తో పాటు బస్సు డిపో రాజుపేట మండలం అలుబాక, పేరూరు మండలాలను చేసి ఎల్చేట్టిపల్లి కొండయి బ్రిడ్జ్ అయిలాపురం రోడ్డు కాంతనపల్లి రోడ్డు కాంతనపల్లి చెరువు కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఏబై పడకల హాస్పిటల్ మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని డా. జాడి రామరాజు నేత అన్నారు.