బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం
(యువతరం ఆగష్టు,19) విశాఖ ప్రతినిధి:
కలెక్టర్ కార్యాలయంలో బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిపై *జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు* అధ్యక్షతన సమావేశం. పాల్గొన్న జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి శాసన సభ్యులు ఎస్.వి చినప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, మునిసిపల్ చైర్మన్ వెంకట మురళీ కృష్ణరావు, నియోజకవర్గం పరిధిలోని ఎం.పి.పి.లు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూడి ముత్యాలు నాయుడు మాట్లాడుతూ
అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆలస్యం కాకూడదని, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష నెరవేర్చాలని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
గృహ నిర్మాణం, ఆర్ & బి, పురపాలక శాఖ, జలవనుల శాఖ, వైద్యం, ఆరోగ్యం, విద్య, ఉపాధి హామీ, స్త్రీ శిశు సంక్షేమం, జగనన్నకు చెబుదాం, గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఇంకా ఎక్కడైనా రోడ్డు మరమ్మత్తులు విద్యుత్ శాఖ సమస్యలు, రోడ్డు నిర్మాణ పనులు ఉంటే యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోనీ ఆర్.బి.పురం, తెర్లాం, బొబ్బిలి, బాడంగి మండలాల అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.