ANDHRA PRADESHPOLITICS
నారా చంద్రబాబునాయుడు తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యం

నారా చంద్రబాబు నాయుడు తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యం
( యువతరం న్యూస్ ఆగస్టు 19 ) డోన్ ప్రతినిధి
డోన్ పట్టణంలో 6వ వార్డు నందు భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమం లో ధర్మవరం మన్నే పెద్ద నాగిరెడ్డి, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు టిడిపి నాయకులతో కలిసి వైసిపి ప్రజావ్యతిరేక పాలనను వివరిస్తూ… తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేరే సంక్షేమ పథకాల గురించి, జరిగే రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టి.ఎన్.టి.యు.సి అధ్యక్షులు అజీజ్, సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, రఘు,డోన్ మండలం టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు రామాంజనేయులు, ఐటిడిపి వినయ్ చౌదరి,గంధం చరణ్, రంగస్వామి,చంద్ర, విశ్వం,వసీం, మదనగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు