CRIME NEWSTELANGANA
మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

మహబూబ్ నగర్ లోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కె నరసింహ
మహబూబ్ నగర్ యువతరం ప్రతినిధి;
మంగళవారం సాయంత్రం పట్టణంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ నందు గల రికార్డ్స్ ని తనిఖీ చేసారు. స్టేషనకి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారికి సత్వారమే న్యాయం చేయమని చెప్పారు. పిర్యాదుదారులను పోలీస్ స్టేషన్ నందు ఎక్కువ సమయం వేచి ఉంచరాదని రాగానే వారి దరఖాస్తుని పరిశీలించాలని చెప్పారు. అలాగే పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోమని ఆదేశాలిచారు.
ఈ విసిటింగ్ నందు డిఎస్పీ మహేష్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బంది హాజరున్నారు.