EDUCATIONTELANGANA

అతిగా ఫీజులు వసూలు చేస్తున్న ఎస్ పి ఆర్ కిడ్స్ స్కూల్

అతిగా ఫీజులు వసూలు చేస్తున్న ఎస్ పి ఆర్ కిడ్స్ స్కూల్ పై నేను తీసుకోవాలి

దేవరకొండ యువతరం విలేఖరి;

దేవరకొండ నియోజకవర్గం లోని ఎస్ పి ఆర్ స్కూల్ అగడాల రోజుకి రోజుకి ఎక్కువ అవుతున్నాయి. నర్సరీ నుండి యూకేజీ ,ఎల్కేజీ వరకు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. మరియు ఇదే కాక బుక్స్ పేరుతో, నోట్బుక్ పేరుతో అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పేరెంట్స్ ను ఆగం చేస్తున్నారు. ఇలా రోజు,రోజుకు ప్రైవేటు స్కూల్లో పరిస్థితి పేరెంట్స్ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో యజమాన్యాలు వ్యాపారం చేస్తున్నారు. ప్రవేట్ స్కూల్లో చదివించడానికి తల్లిదండ్రులు 24 గంటలు పని చేసి 100 సంపాదిస్తే, ఒక సంవత్సరం దాదాపు 30 వేల వరకు ఫీజు రావడంతో బెంబేలు ఎత్తుతున్నారు. ప్రైవేట్ స్కూల్ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ పోతే తల్లిదండ్రుల ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్స్ అన్నారు. పిల్లల చదువు ఎల్కేజీ, యూకేజీ లోనే ఇంత ఉంటే మరి పై తరగతుల పరిస్థితి దౌర్భాగ్యంగా ఉందని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడైనా జిల్లా కలెక్టర్ మరియు డీఈవో స్పందించి ఇలా అక్రమంగా వసూలు చేస్తున్న ఈ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకొని వెంటనే ఫీజులు తగ్గించేలా చొరవ చూడాలని లేనియెడల పెద్ద ఎత్తున పేరెంట్స్ అసోసియేషన్ నుండి రాస్తారోకో ధర్నాలు చేపడతామని పిల్లల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. దేవరకొండ ఎస్పీఆర్ స్కూల్ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఎస్ పి ఆర్ పాఠశాల నందు ఉదయం సమయంలో పాములు వస్తున్నాయని, బాత్రూంలో కూడా పిల్లలకు సరిపోవడం లేదు అలాగే అపరిశుభ్రంగా ఉంటున్నాయి తెలిపారు. ఎస్ పి ఆర్ కార్పొరేట్ స్కూల్ అని పెట్టి రేకుల షెడ్డు కింద నడపడం విడ్డూరంగా ఉందని అన్నారు. వాష్రూమ్స్ కూడా సరైన విధంగా లేవని తల్లిదండ్రులు విద్యార్థిని, విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!