
వీఆర్వోలను నియమించండి
వెల్దుర్తి యువతరం విలేఖరి;
వెల్దుర్తి మండలం లో ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను భర్తీ చేయాలని ఆయా గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ముఖ్యంగా వెల్దుర్తిలో ముగ్గురు వీఆర్వోలు బదిలీ కావడం జరిగింది, ఈ విధంగా సూదేపల్లి, కలుగొట్ల వీఆర్వోలు బదిలీ అయ్యారు. మొత్తం ఐదుగురు విఆర్ఓ లేకపోవడంతో ఆయా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు కల్పించుకొని వెంటనే వీఆర్వో లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఉంది. ఆ సమయానికి వెల్దుర్తిలో ఎవరూ లేకపోతే ప్రజలు దరఖాస్తు చేసుకున్న వారికి దృవీకరణ పత్రాలు ఎలా ఇస్తారు అన్నది ప్రశ్న. విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, భూ సమస్యలు వంటి వాటికి పరిష్కారం కావాలంటే ఆయా గ్రామ విఆర్వోలు తప్పకుండా ఉండవలసిందే. కాబట్టి జిల్లా అధికారులు కల్పించుకొని ఆయా గ్రామాలకు విఆర్ఓ లను ఏర్పాటు చేయవలసిందిగా మరి ,మరి వేడుకుంటున్నారు.