ANDHRA PRADESHDEVOTIONALEDUCATIONWORLD
బాలికల హైస్కూల్లో ఉట్టి పండుగ

బాలికల హైస్కూల్లో ఉట్టి పండుగ
వెల్దుర్తి ఆగస్టు 25 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన వెల్దుర్తి లోని బాలికల జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం ఉట్టి పండుగను నిర్వహించారు. సోమవారం కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని ఈ వేడుకను ముందస్తుగా నిర్వహించడం జరిగింది. ఇందులో బాలికలు ఉట్టి కొట్టడాన్ని అందర్నీ ఆకర్షించింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రావతికి తల్లిదండ్రులు, విద్యార్థినిలు ధన్యవాదాలు తెలిపారు.