ANDHRA PRADESHDEVOTIONALWORLD
మంత్రాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ రాఘవేంద్రుడి మహా రథోత్సవం

మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రుడి మహారథోత్సవం
మంత్రాలయం ప్రతినిధి ఆగస్టు 23 యువతరం న్యూస్:
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి శ్రీ మఠం అధికారులు, మహా రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఉత్తర ఆరాధన ఉత్సవాన్ని పురస్కరించుకొని అశేష భక్తజన వాహిని మధ్య మహా రథోత్సవం ముందుకు సాగింది. శ్రీ మఠం ప్రాంగణంలోని నుంచి వీధుల గుండా శ్రీ రాఘవేంద్ర కూడలి వరకు శ్రీ రాఘవేంద్రులకు మహారథోత్సవం ఘనంగా జరిగించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరియు మహారాష్ట్ర చెన్నై బెంగళూరు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండగా ఎస్సై గోపీనాథ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.