ప్రజలకు సేవ చేయడంలో అలసత్వం వహిస్తే సహించే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్

ప్రజలకు సేవ చేయడంలో అలసత్వం చేస్తే సహించేది లేదు
వెల్దుర్తి ఆగస్టు 22 యువతరం న్యూస్:
ప్రజలకు సేవ చేయడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తి లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ మాట్లాడుతూ అధికారులు పాత పద్ధతులు మానుకొని నూతన ప్రభుత్వానికి అనుగుణంగా పనితనాన్ని మెరుగుపరుచుకోవాలి అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు. ఎవరైనా అలసత్వం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. అదేవిధంగా అతి త్వరలో చెరువులకు నీరు నింపే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు. విద్య, వైద్యం విషయంలో అలసత్వం వహించవద్దని అధికారులకు సూచించారు. ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించి హార్టికల్చర్ రంగాన్ని అభివృద్ధి ఈ సందర్భంగా బోగోలు సర్పంచ్ అమర్ నాథ్ గౌడ్ మరియు కలుగొట్ల సర్పంచ్ మద్దిలేటి ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ ను ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారిగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కె.ఈ శ్యామ్ కుమార్ కు అధికారులు స్వాగతం పలికారు. ప్రజలు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా గ్రామాలలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.