తహసిల్దారు గారు కిందిస్థాయి ఉద్యోగులు అంటే మీకు అంత చులకనా….????

ఎమ్మార్వో గారు కింది స్థాయి ఉద్యోగులు అంటే మీకు చులకనా…!
పంచాయతీ కార్యదర్శిని అసభ్య పదజాలంలతో దూషించిన తహసిల్దార్
దేవనకొండ ఆగస్ట్ 25 యువతరం న్యూస్:
దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామ పంచాయతీ కార్యదర్శిని దేవనకొండ తహసిల్దార్ తమ కార్యాలయానికి పిలిపించి అసభ్య పదజాలాలతో మాట్లాడుతూ అవమానించడం జరిగిందని ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులు అంటే తహసిల్దార్ కు చులకన బావంగా చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే అలారుదిన్నె సచివాలయంలో పనిచేస్తున్న ఒక సర్వేయర్ 15 రోజుల నుండి ఎమ్మార్వో ఆఫీస్ లో విధులు నిర్వహిస్తూ సచివాలయమునకు రాకుండా అక్కడే విధులు నిర్వహిస్తున్నానని అక్కడ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి కి ఈ విషయం తెలియజేశారు. ప్రతి నెల జీతం పెట్టే సమయంలో 15 రోజులు సచివాలయం డ్యూటీలో లేనందున అక్కడ పని చేస్తున్న సెక్రెటరీ ఎమ్మార్వో ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న సర్వేర్ని అక్కడ డ్యూటీ చేస్తున్నట్లు డ్యూటీ సర్టిఫికెట్ తీసుకురమ్మని తెలియజేశారని, ఆ విషయము ఎమ్మార్వో ఆఫీస్ లో ఆ సర్వేరు తెలియజేశారు. ఆ విషయానికి సంబంధించి అలారుదిన్నె పంచాయతీ సెక్రెటరీ నీ తహసిల్దారు తమ కార్యాలయానికి పిలిపించుకొని నీవు మమ్ములను డ్యూటీ సర్టిఫికేట్ అడిగేవాడివా అని అసభ్య పదజాలములతో దూషిస్తూ మన స్థాపానికి గురి చేసే విధంగా మాట్లాడడం జరిగిందని తమ ఆవేదనను తెలియచేశాడు. ఈ విషయం తెలుసుకున్న మిగతా పంచాయతీ సెక్రటరీలు అందరూ కలిసి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా తహసిల్దారు మాట్లాడడం బాధగా ఉందన్నారు ఎందుకు అలా మాట్లాడారో మాకు వివరణ తెలియజేయవలసిందిగా అక్కడ ఉన్న డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.