పవన్ కళ్యాణ్ స్పూర్తితో సేవా కార్యక్రమాలు

పవన్ కళ్యాణ్ స్పూర్తితో సేవా కార్యక్రమాలు
పల్లెటూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జొన్న రాజేష్
ఆత్మకూరులో దివ్యాంగుడికి ట్రై సైకిల్, నిత్యవసర సరుకులు అందజేత
జొన్న రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహణ
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 11 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జొన్న రాజేష్ అన్నారు. ఆత్మకూరులోని మేడవరపు రామాంజనేయులు అనే దివ్యాంగుడికి మంగళవారం జొన్న రాజేష్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్ అందజేశారు. నెలకు సరిపడా సరుకులు, బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జొన్న రాజేష్ మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేడవరపు రామాంజనేయులు కు ట్రై సైకిల్, నిత్యావసర సరుకులను అందజేసినట్లు చెప్పారు. చిల్లపల్లి శ్రీనివాసరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం అందించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.వాసా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.చిట్టెం అవినాష్ మాట్లాడుతూ, చిలపల్లి శ్రీనివాసరావు సహకారంతో దివ్యాంగుడు రామాంజనేయులు కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
జొన్న రాజేష్ కు కృతజ్ఞతలు తెలిపిన రామాంజనేయులు:
తనకు గతంలో ఉన్న ట్రై సైకిల్ చెడిపోయిందని దివ్యాంగుడు మేడవరపు రామాంజనేయులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు నూతన ట్రై సైకిల్ అవసరం ఉందని సమాచారం తెలుసుకున్న వెంటనే జొన్న రాజేష్ స్పందించి ముందుకు వచ్చి ట్రై సైకిల్ అందజేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సామల నాగేశ్వరరావు,(ఎస్ ఎన్ ఆర్),వాసా శ్రీనివాసరావు, చిట్టెం అవినాష్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధు తదితరులు పాల్గొన్నారు.