పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 10 యువతరం న్యూస్:
మంగళగిరిలో ఈనెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం స్థానిక లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలలో ఉపాధ్యాయులు, టీచర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి నాయకులు ఓటర్లకు వివరించారు. పలుదాపాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించుకుంటే పట్టభద్రులకు మేలు జరుగుతుందని, మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటికి వేయాలని వారు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు అందె మురళీ తదితరులు పాల్గొన్నారు.