హెల్మెట్ ఉన్నా.. ధరించేందుకు ఎందుకు భారం

హెల్మెట్ ఉన్నా.. ధరించేందుకు ఎందుకు భారం
మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్
ఇకపై హెల్మెట్ ధరించకుండా వస్తే పట్టణంలోకి నో ఎంట్రీ
సిఐ స్పష్టీకరణ
ఆల్ఫా హోటల్ వద్ద స్పెషల్ డ్రైవ్
ఇంటి నుండి హెల్మెట్ తెప్పించు మరి ధరింపజేసి పంపించిన సీఐ.
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 11 యువతరం న్యూస్:
అనేక మంది వాహన చోదకుల వద్ద హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించకుండానే తమ ద్విచక్ర వాహనాలపై నిర్లక్ష్యంగా రాకపోకలు సాధిస్తున్నారని మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్ అన్నారు. హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించటానికి ఎందుకు భారం అని ఆయన ప్రశ్నించారు. మంగళగిరి పట్టణంలోని ఆల్ఫా హోటల్ వద్ద మంగళవారం సాయంత్రం సిఐ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలువురికి జరిమానా విధించారు.హెల్మెట్ ధరించకుండా మంగళగిరి పట్టణంలోకి ప్రవేశించే వారిని, హెల్మెట్ లేకుండా పట్టణం వెలుపలకు వెళ్లే వారిని ఆపి హెల్మెట్ వాడకం ప్రాధాన్యతను వివరించారు. పలువురు వాహన చోదకుడు తమ ఇళ్ల వద్ద హెల్మెట్ ఉందని చెప్పగా, ఇంటి నుండి తెప్పించి ధరింపజేసి పంపించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ఇటీవల ప్రాణాలు కోల్పోయారని కోల్పోతున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వలన ఎక్కువ శాతం ప్రమాదాల్లో మరణాలకు కారణం అవుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో వాహన చోదకులు అవగాహనతో మెలగాలని తెలిపారు. లోకల్ అయినా, నాన్ లోకల్ అయినా, హెల్మెట్ వాడకాన్ని విధిగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. కార్లలో వెళ్లే వారు సీట్ బెల్ట్ ను ధరించాలని అన్నారు. మీపై మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అన్న వాస్తవాన్ని మరువకూడదని గుర్తు చేశారు. ఇక నుండి ఎవరైనా హెల్మెట్ లేకుండా వస్తే పట్టణంలోకి అనుమతించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. హెల్మెట్ లేకుండా రాకపోకలు సాగించినా,త్రిబుల్ రైడింగ్ చేసినా, వాహనాలకు సైలెన్సర్లు తీసేసి నడిపి ప్రజలకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఐ వినోద్ కుమార్ హెచ్చరించారు.