ఘనంగా మాఘ పౌర్ణమి ఉత్సవాలు

ఘనంగా మాఘ పౌర్ణమి ఉత్సవాలు
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 11 యువతరం న్యూస్:
మంగళగిరి మండలం పెద్ద వడ్లపూడి గ్రామంలో ఉత్తర వీధి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు మాఘ పౌర్ణమి పురస్కరించుకొని మంగళవారం రాత్రి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా పూజా కార్యక్రమాల అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చంద్ పూలమాలలు వేశారు.వాల్మీకి బోయ సంఘస్తుల ఆధ్వర్యంలో పూజలు చేసి అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారుగా 3,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చంద్ , గ్రామ పార్టీ అధ్యక్షులు యేళ్ళ శివరామయ్య, టిడిపి పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్, మండల బీసీ సెల్ అధ్యక్షులు కటారి అప్పారావు, రాష్ట్ర పద్మశాలియ కమిటీ సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ, గుడిమెట్ల మరియదాసు, బొర్రా శ్రీకాంత్, జాలాది సందీప్, కట్ట దుర్గారావు, హాజరయ్యారు. వాల్మీకి సంఘస్తులు వచ్చిన అతిథులను శాలువాతో సత్కరించారు.