పెద్దాయనకు మంత్రి పదవి దక్కేనా….?

పెద్దాయనకు మంత్రి పదవి దక్కేనా….?
త్యాగమూర్తి షబ్బీర్ అలీ
కామారెడ్డి అంటే షబ్బీర్ కాంగ్రెస్ అంటే షబ్బీర్
45 సంవత్సరాల రాజకీయ యోధుడు
తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి
కామారెడ్డి ని వదిలి నిజాంబాద్ లో పోటీ చేసిన పెద్దాయన
మంత్రి పదవి వస్తుందని కామారెడ్డి నిజామాబాద్ నాయకులు ఎదురుచూపులు
పెద్దాయనకు మంత్రి పదవి చేస్తే కిందిస్థాయి కార్యకర్తలకు మేలు జరుగుతుంది
మూడుసార్లు ఓటమి జరిగిన కార్యకర్తల గుండెల్లో ఉన్న నాయకుడు
కామారెడ్డి ప్రతినిది ఫిబ్రవరి 8 యువతరం న్యూస్:
కామారెడ్డి జిల్లా పెద్దాయన కాంగ్రెస్ పార్టీ పెద్దాయన ప్రభుత్వ సలహాదారు
మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి మంత్రి పదవి వరిస్తుందని అభిమానులు నాయకులు కార్యకర్తలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి షబ్బీర్ అలీ ఈసారి మంత్రి పదవిలో కీలక పదవి దక్కుతుందని కార్యకర్తలు అభిమానులు ఉమ్మడి జిల్లా నాయకులు ఎదురుచూస్తున్నారు. మైనార్టీ కి చెందిన నాయకుడిగా మరియు ఢిల్లీ స్థాయిలో మంచి పేరు సంపాదించిన పెద్దాయన షబ్బీర్ అలీకి ఈసారి ఎమ్మెల్సీ కోటాలో కచ్చితంగా కీలక మంత్రి శాఖ దక్కుతుందని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మరియు అలాగే తాను పోటీ చేసే నియోజకవర్గం త్యాగం చేసి తన పక్క నియోజకవర్గమైన నిజామాబాద్ జిల్లాలో పోటీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి గా ఉన్నప్పుడు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత షబ్బీర్ అలీ ఇది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరితో సఖ్యతగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డికి పెద్దన్న లాగా ఉండి అన్నీ తానే నడిపించి కాంగ్రెస్ పార్టీ వెన్నంటుండి అధికారంలోకి రావడానికి కృషిచేసిన నాయకుడు షబ్బీర్ అలీ. అలాంటి నాయకుడికి మరియు ముఖ్యంగా మైనార్టీ లో ఒక మచ్చలేని నాయకుడిగా అందరితో ఆత్మీయుడుగా అపర భగీరథుడిగా మనసున్న మంచి మహారాజుగా పేరు సంపాదించిన నాయకుడు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన నాయకుడికి మంత్రి పదవి వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఢిల్లీ నుంచి గల్లీ దాకా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి పెద్దాయన షబ్బీర్ అలీ మాత్రమే అని కార్యకర్తలు మరియు నాయకులు ప్రతినిత్యం తలుచుకుంటూ మా షబ్బీర్ సార్ కు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు. ఢిల్లీలో పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తిగా మచ్చలేని నాయకుడిగా మరియు రాష్ట్రంలో అందరి తోఒక సామాన్య వ్యక్తిగా ఉండే నాయకుడు షబ్బీర్ అలీ. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద అన్నల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు లుగా వ్యవహరిస్తున్న షబ్బీర్ అలీ కి మంత్రి పదవి వరిస్తుందని గత 14 నెలల నుండి కార్యకర్తలు సెకండ్ క్యాడర్ నాయకుడు ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఐకమండ్ షబ్బీర్ అలీ వైపు మొగ్గుచూపుతోందా లేదా ఏదైనా పెద్ద పదవి ఇచ్చి కేంద్రానికి పంపుతుందా అని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.