సర్వేలను పగడ్బందీగా నిర్వహించండి
విధి నిర్వహణలో అలసత్వం వహించిన సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారి

సర్వేలను పగడ్బందీగా నిర్వహించండి
పింఛన్ దారులు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి
విధి నిర్వహణలో అలసత్వం వహించిన సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారి
ఎంపీడీవో సుహాసినమ్మ
వెల్దుర్తి ఫిబ్రవరి 8 యువతరం న్యూస్:
మండలంలోని 18 గ్రామ సచివాలయ ఉద్యోగులు జియో కోఆర్డినేట్స్, ఎన్పీసీఐ ఇన్ యాక్టివ్, ఎన్పీసీఐ యాక్టివ్, మిస్సింగ్ సిటిజన్స్, ఎమ్మెస్ ఎంఈ , మిస్సింగ్ ఎంప్లాయిస్ తదితర సర్వేలను పకడ్బందీగా నిర్వహించాలని వెల్దుర్తి మండల ఎంపీడీవో సుహాసినమ్మ తెలిపారు. శనివారం సెకండ్ సాటర్ డే అయినా విధులు నిర్వహించవలసిందేనని ఎంపీడీవో తెలిపారు. బుధవారం నాటికి సంపూర్ణంగా సర్వేలు పూర్తి చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో సర్వే పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు శాఖ పరమైన చర్యలు తీసుకుంటారని ఎంపీడీవో హెచ్చరించారు.
ప్రభుత్వం నిర్ధారించిన వికలాంగులు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎంపీడీవో సుహాసినమ్మ తెలిపారు. ఈనెల 18, 19 తేదీలలో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో 86 మంది పింఛన్దారులు తప్పకుండా అక్కడ వైద్యులచే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. 86 మంది పింఛన్దారులకు నోటీసులు ఇస్తున్నామన్నారు. ఒకవేళ వైద్యుల వద్ద నిర్ధారణ పక్షాలు చేయించుకొనకపోతే పింఛన్ నిలిపి వేయవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు.
మండల కేంద్రమైన వెల్దుర్తిలోని 1,2,3 సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు ఉద్యోగులకు క్రమశిక్షణ రాహిత్యం కింద నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.