ANDHRA PRADESHFILMSTATE NEWS
హ్యాపీ రిసార్ట్స్ లో ఆల్బమ్ సాంగ్స్ ఆవిష్కరణ

హ్యాపీ రిసార్ట్స్ లో ఆల్బమ్ సాంగ్స్ ఆవిష్కరణ
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 8 యువతరం న్యూస్:
మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో శుక్రవారం కాజకు చెందిన విక్రమ్ శివ దర్శకత్వంలో రూపొందించిన రాయే రాయే రామ్ చిలక ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హ్యాపీ రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహన్ కృష్ణ హాజరై ఆల్బమ్ సాంగ్ ను ఆవిష్కరించారు. అనంతరం అంబటి మాట్లాడుతూ విక్రమ్ శివ సమాజానికి ఉపయోగపడే మరిన్ని మంచి ఆల్బమ్ సాంగ్స్ చేయాలని ఆయన అన్నారు. ఈ పాట జాన్విక అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ లో వస్తుందని ప్రేక్షకులు చూసి ఆల్బమ్ యువ ఆర్టిస్టులను ఆదరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ చిత్ర దర్శకులు అల్లాని శ్రీధర్, ఆల్బమ్ హీరో ఓంకార్ సాయినాథ్, సినీ నిర్మాత మురళి కృష్ణ పాల్గొన్నారు.