ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షునిగా పేరం

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షునిగా పేరం
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 8 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా మంగళగిరి పట్టణానికి చెందిన పేరం శ్రీనివాసరావును నియమిస్తూ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరిలో శుక్రవారం బుల్లా, శ్రీనివాసరావుకు నియామక పత్రం అందజేశారు. పేరం ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అనంతరం రాజారావు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన శ్రీనివాసరావు జిల్లా కమిటీ తోపాటు నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీలకు అందే విధంగా కృషి చేయాలన్నారు.