బీసీలకు పూర్వవైభవం

బీసీలకు పూర్వవైభవం
క్యాబినెట్లో ఆమోదం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపిన బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ యాదవ్
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 8 యువతరం న్యూస్:
గతంలో ఎన్టీఆర్ హయంలో బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 20 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానిని 34 శాతానికి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు దేనని తుల్లిమిల్లి రామకృష్ణ యాదవ్ అన్నారు.అయితే గత వైసిపి ప్రభుత్వం బీసీలకు మైనార్టీలకు కలిపి 29 శాతానికి కుదించారు.అని
ఎస్సీలకు 15శాతం మైనార్టీలకు 6శాతం కలిపి రిజర్వేషన్ను 50 శాతానికే పరిమితం చేస్తూ 2019లో చట్టం కూడా తెచ్చారని, నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్ పరిమితి నిబంధన అమలు చేయాల్సిన అవసరం లేకపోయినా పరిమితి తీసుకురావడంతో ఆయా వర్గాలకు తీరని అన్యాయం జరిగింది.
ఈ విషయంగా బీసీ సంఘాలు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ధర్నాలు, ఆందోళనలు చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 34 శాతం కోటా ఇస్తామని హామీ ఇచ్చారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు జగన్ తెచ్చిన సదరు చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటూ బీసీల ప్రయోజనాలు కాపాడేందుకై 34 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేయటం హర్షదాయకం… అని తుల్లిమిల్లి కొనియాడారు.
నామినేటెడ్ పదవుల్లో బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీసీ సమాజం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.